గుణా టీమ్ వర్క్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'రుద్రమదేవి'. అనుష్క నాయిక. దర్శకనిర్మాత గుణశేఖర్ చిత్ర విశేషాలను వెల్లడిస్తూ "తొలి షెడ్యూల్‌తో 35 శాతం పూర్తయింది. ఐమాక్స్ త్రీడీ థియేటర్‌లో ఫస్ట్ షెడ్యూల్ రష్‌ను నా టీమ్‌తో పాటు చూశాను. సంతృప్తికరంగా అనిపించింది. రుద్రమదేవిగా నటిస్తున్న అనుష్క ఈ చిత్రంలో బంగారంలో వజ్రాలు పొదిగిన నిజమైన ఆభరణాలను ధరించింది.  వాటి విలువ రూ.5 కోట్లు. నీతాలుల్లా డిజైన్ చేశారు. 'జోధా అక్బర్'నగల రేంజ్‌లో ఈ సినిమాలోని నగలు కూడా ప్రాచుర్యం పొందుతాయన్న నమ్మకం ఉంది. రెండో షెడ్యూల్‌ను జూలై 3నుంచి 15 వరకు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవన్ ఏకర్స్‌లో వేసిన వెయ్యి స్తంభాల గుడిలో చిత్రీకరిస్తాం. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాల్ని, ఓ పాటని తెరకెక్కిస్తాం. డిసెంబర్‌కు చిత్రీకరణ పూర్తవుతుంది. సుమన్ విలన్‌గా నటిస్తున్నారు'' అని అన్నారు.

సుమన్ మాట్లాడుతూ "తమిళంలో విలన్‌గా చేశానుగానీ తెలుగులో చేయడం ఇదే తొలిసారి. తొలి ఇండియన్ హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ త్రీడీ 'రుద్రమదేవి'లో హరిహరదేవుడు పాత్రలో నటించడం ఆనందంగా ఉంది'' అని చెప్పారు. రానా, కృష్ణంరాజు, ప్రకాష్‌రాజ్, జారా షా, నథాలియా కౌర్ తదితరులు ఇతర కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.రామ్‌గోపాల్

Tags: Telugu Cinema News, Telugu Movies, Film News

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.

Powered by themekiller.com