పూరీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్..డిటేల్స్
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించనున్నారా...అవుననే అంటోంది ఇండస్ట్రీ. ఈ మేరకు టాక్స్ జరగాయని, పవన్ ఓ స్టోరీ లైన్ ఓకే చేసాడని చెప్తున్నారు. పూరీ కెరీర్ ప్రారంభంలో బద్రీ అనే చిత్రాన్ని పవన్ తో చేసారు. మళ్లీ అప్పటినుంచీ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు పవన్ ,పూరీ లను నిర్మాత డివివి దానయ్య కలుపుతూ సినిమా చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక హీరోయిన్ గా అనీల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ నటించనుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ ..తన గబ్బర్ సింగ్ చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. హరీష్ శంకర్ దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. అలాగే పూరీ దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందిన బిజినెస్ మ్యాన్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ చిత్రం మహేష్ అభిమానులుకు ఓ ట్రీట్ లాంటిదని చెప్తున్నారు. కొత్త తరహా డైలాగులతో,స్టైలిష్ మేకింగ్ తో ఈ చిత్రం కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక పూరీ,పవన్ కాంబినేషన్ సినిమా అంటే ఓ రేంజి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. మరి ఈ సారి పవన్ ని ఏ విధంగా చూపెట్టబోతున్నాడో చూడాలి. త్వరలోనే ఈ మేరకు అఫీషయల్ ప్రకటన రానుందని సమాచారం.